Advertisement

వేడిలో నిరసనా..?

Sat 23rd Apr 2016 03:32 PM
ys jagan,summer,ys jagan summer camp,ys jagan dharna,ysrcp  వేడిలో నిరసనా..?
వేడిలో నిరసనా..?
Advertisement
 సూర్యప్రతాపం రోజు రోజుకి పెరుగుతోంది. 50 డిగ్రీల వరకు చేరింది. ఇలాంటి ఎండలో ప్రజలు బయటకి వెళ్ళకూడదని ప్రభుత్వంతో పాటు మీడియా విజ్ఞప్తి చేస్తోంది. ఇంతటి ప్రమాదకర వేడిలో వైకాపా కార్యకర్తలను సమీకరించి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బయట వేడి ఎంతగా ఉందో వైకాపా నేత జగన్ కు లోన కూడా అంతే వేడి ఉన్నట్టుంది. ఎందుకంటే తన పార్టీ ఎమ్మెల్యేలను తెదేపా కొనేస్తుందనేది ఆయన ఆరోపణ. ఇప్పటికే 12 మంది తెదేపాలోకి జంప్ అయ్యారు. పరిస్థతి చూస్తే మరికొందరు అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఆపడానికి మరేమార్గం లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్య వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగాలని కార్యకర్తలకు ఆదేశాలు వెళ్ళాయి. 
 ఇంతటి ఎండలో నిరసన అంటే రిస్క్ వ్యవహారమే. వేడిమి తట్టుకోలేక వడ దెబ్బలాంటిది తగిలితే ప్రమాదమే. అసలు ఈ పరిస్థితిలో కార్యకర్తలు కదిలివస్తారా అనే అనుమానం నేతల్లో ఉంది. ఆహారం సంగతి తర్వాత అందరికీ మంచినీళ్ళు సరఫరా చెయ్యడమే కష్టం అని మండల స్థాయి నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాస్వామ్య రణభేరీ అంటూ  కార్యకర్తలను, నాయకులను ఎండలో తిప్పడం అంటే రిస్క్ వ్యవహారమే. రణభేరీకి ఇది సరైన సమయం కాదని వైకాపా నేతలో వాపోతున్నారట.     ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేస్తున్నారని జగన్ పదేపదే ఆరోపిస్తున్నారు. డబ్బుకు వైకాపా ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని ఆయన అంగీకరిస్తున్నారు. తమని సంతలో పశువుల్లా జగన్ భావిస్తున్నారని, ఆయన ఆలోచనా విధానం మారాలని పార్టీ జంప్ చేయని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. 
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement