Advertisementt

ఈ సినిమా హిట్టైతేనే వాళ్లకి భవిష్యత్తు!

Fri 22nd Apr 2016 04:23 PM
rakul preet singh,catherine tresa in sarrainodu,sarrainodu movie,hit,future,catherine tresa  ఈ సినిమా హిట్టైతేనే వాళ్లకి భవిష్యత్తు!
ఈ సినిమా హిట్టైతేనే వాళ్లకి భవిష్యత్తు!
Advertisement
Ads by CJ

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో అగ్రనాయికగా మారిన హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కానీ ఒకటి అరా చిత్రాలు తప్పితే ఆమెకు విజయాల శాతం కూడా చాలా తక్కువే. అంతేకాదు ఆమె స్టార్‌హీరోలతో చేసిన చిత్రాలేవీ హిట్‌ కాలేదు.అయినా కూడా ఆమెకు ఇప్పటికీ  స్టార్స్‌ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయంటే గ్రేటే అని ఒప్పుకోవాలి.  కాగా రేపు విడుదల కానున్న సరైనోడు చిత్రం హిట్టయితేనే ఆమెకు మరికొంత భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈ చిత్రం ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆమెపై ఐరన్‌లెగ్‌ అనే ముద్ర పడటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఆమెకు ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలలో సైతం అవకాశాలు లేవు. ఇక కేథరిన్‌ విషయానికి వస్తే ఆమెకు కూడా టాలీవుడ్‌లో ఐరన్‌లెగ్‌ ముద్ర ఉంది. అసలు ఈ చిత్రంలో రాజకీయనాయకురాలిగా ఆమెను తీసుకున్నప్పుడు అందరూ షాకయ్యారు. దీంతో ఈ ఇద్దరు హీరోయిన్ల భవిష్యత్తు బన్నీ చేతిలో ఉందనే చెప్పాలి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ