Advertisementt

'ఫ్యాన్'సినిమాపై షారుఖ్ ఫ్యాన్ కేసు!

Thu 21st Apr 2016 08:15 PM
shahrukh khan,fan movie,shahrukh fans  'ఫ్యాన్'సినిమాపై షారుఖ్ ఫ్యాన్ కేసు!
'ఫ్యాన్'సినిమాపై షారుఖ్ ఫ్యాన్ కేసు!
Advertisement
Ads by CJ

రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన 'ఫ్యాన్' సినిమా రిలీజ్ అయింది. అన్ని చోట్ల ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ సినిమా చూసి షారూఖ్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్త పరుస్తున్నారు. కొంతమంది అభిమానులు అయితే షారూఖ్ ‘ఫ్యాన్’ పోస్టర్లను తగలపెడుతున్నారని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా చూసిన ఒక అభిమానైతే షారుఖ్ పై ఏకంగా 19 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ కేసు వేసింది. ఆరువందల రూపాయల చొప్పున సుమారుగా 3000 రూపాయల టికెట్స్ కొని సినిమా చూస్తే.. తనకు మిగిలింది మెంటల్ టార్చర్ అని కోర్టుకెక్కింది. అలానే సినిమా ప్రమోషన్స్ లో చూపించిన ఒక పాట కూడా సినిమా లేకపోవడం తనను నిరాశ పరిచిందని పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ