Advertisementt

తేజ ఎదురు చూపులు!

Thu 21st Apr 2016 01:21 PM
kajal,director teja,kajal with director teja combination,balakrishna,gowthami putra satakarni movie  తేజ ఎదురు చూపులు!
తేజ ఎదురు చూపులు!
Advertisement
Ads by CJ

చిత్రం, నువ్వు నేను, నిజం, జయం వంటి ఎన్నోచిత్రాలను తీసిన దర్శకుడు తేజ గత కొంతకాలంగా చేసిన ఏ సినిమా కూడా పట్టుమని పదిరోజులు కూడా ఆడలేదు. ]దీంతో ఆయన కెరీర్‌ తెరమరుగు దిశగా సాగుతోంది. కాగా ఆయన చివరిగా దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్‌ డాష్‌... హోరాహోరి చిత్రాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాగా త్వరలో ఆయన రాజశేఖర్‌తో కలిసి అహం చిత్రం చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ఎవరికి వారే మోనార్క్‌లైన ఈ ఇద్దరు ఒకే ఒరలో ఒదగలేకపోవడంతో ఈ చిత్రం సెట్స్‌పైకి కూడా వెళ్లకుండా ఆగిపోయింది. రాజశేఖర్‌ ,తేజాలకు మద్య సయోధ్య లేకనే ఈ చిత్రం ఆగిపోయిందని సమాచారం. కాగా ప్రస్తుతం తేజ మరో స్క్రిప్ట్‌ను రెడీ చేసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేష్‌బాబుకు వినిపించి ఓకే చేయించాడట. ఈ చిత్రంలో రానాను హీరోగా తీసుకున్నాడు. హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ను ఒప్పించాడు. కాగా కాజల్‌కు ఇటీవల విడుదలైన సర్దార్‌గబ్బర్‌సింగ్‌ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ఆమెను బాలయ్య 100వ చిత్రంలో గౌతమీపుత్ర శాతకర్ణి సహధర్మచారిణిగా నటించమని డైరెక్టర్‌ క్రిష్‌తో పాటు బాలయ్య కూడా కోరాడని సమాచారం. కానీ ఆమె ఆ అవకాశాన్ని వదిలేసింది. బాలయ్య 100వ చిత్రాన్నే వదిలేసిన కాజల్‌ ఇప్పుడు తేజ సినిమాకు కమిట్‌ అవ్వడం కాస్త ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది. కాగా తనను లక్ష్మీ కళ్యాణం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేసిన తేజ పట్ల ఉన్న గౌరవంతోనే ఆమె ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ