Advertisementt

మెగాస్టార్‌ డైలమాకు కారణం ఏమటి...?

Wed 20th Apr 2016 10:33 AM
chiranjeevi,100 movie,kathi remake,v.v.vinayak,new story  మెగాస్టార్‌ డైలమాకు కారణం ఏమటి...?
మెగాస్టార్‌ డైలమాకు కారణం ఏమటి...?
Advertisement
Ads by CJ

ఎన్నోరోజులుగా మెగాభిమానులను ఊరిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి సంబంధించిన మరో వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇన్ని రోజులు తమిళ కత్తి రీమేక్‌లో ఆయన నటించనున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా మెగా ఫ్యామిలీ సైతం ఖరారుచేసింది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో వినాయక్‌, చిరు బిజీగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ వినాయక్‌ తెలుగు వెర్షన్‌కు కావల్సినంత మార్పులు చేర్పులు చేసినప్పటికీ సెకండాఫ్‌ మాత్రం చిరును మెప్పించలేకపోయిందని సమాచారం. దీంతో వినాయక్‌ బాగా ఆలోచించి మరో ఫ్రెష్‌ కథను తయారుచేసి చిరుకి వినిపించాడట. ఈ కథ కత్తి కంటే బాగా ఉందని ఫీలయిన చిరు ఈ కథ వైపే మొగ్గు చూపాడని సమాచారం. ప్రస్తుతం ఈ కొత్త కథను సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌లో వినాయక్‌ బిజీగా ఉన్నాడట. మొత్తానికి మెగాస్టార్‌ 150వ చిత్రం మరింత లేటవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయినా ఇంత అనుభవం ఉన్న చిరు ఇప్పటికీ ఫైనల్‌ డెసిషన్‌ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ  తన 100వ చిత్రం విషయంలో ఎవరు ఎన్ని అనుకున్నా తన నిర్ణయాన్ని ఆలస్యం చేయకుండా తీసుకున్నాడనే అంటున్నారు.  ఇంతకీ చిరుకు ఉన్న భయం, సందేహాలు ఏమిటి? అనే విషయంలో తలా ఒక మాట మాట్లాడుతున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ