Advertisement

పూరి ఎందుకు ఇలా చేశాడో..?

Tue 19th Apr 2016 02:06 PM
puri jagannath,loafer movie,distributors  పూరి ఎందుకు ఇలా చేశాడో..?
పూరి ఎందుకు ఇలా చేశాడో..?
Advertisement

'లోఫర్' సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ నష్టపోవడంతో ఆ డబ్బు చెల్లించాలని దర్శకుడు పూరి జగన్నాథ్ పై వారు దాడి చేశారని.. పూరి జగన్నాథ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సంస్థ మీడియా ముఖంగా వెల్లడించారు. వారి వాదన వింటే పూరి ఇలాంటి సిల్లీ ఇష్యూ కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళాడా..? అనిపిస్తోంది. ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కు, ఆయన డైరెక్ట్ చేసే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాన్సీ రేట్స్ ఇచ్చి కొంటుంటారు. అలాంటి ఒక డిస్ట్రిబ్యూటర్ నేను నష్టపోయానని పూరి దగ్గరకు వెళితే సానూకులంగా స్పందించాలి. ఆ నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉంటే ప్రొడ్యూసర్ తో మాట్లాడమని చెప్పాలి. 

అంతేకాని రిస్క్ తీసుకొని తన సినిమాలకు నమ్మి కొంటున్న పంపిణీదారులు ఎలాంటి దాడి చేయకుండా అక్రమంగా వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం. 309 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండే తెలంగాణా ప్రాంతంలో ఈరోజు కేవలం తొమ్మది మంది మాత్రమే ఉన్నారు. వారిపై కూడా పూరి ఇలాంటి కేసులు పెట్టడం వలన భవిష్యత్తులో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలను ఆయనే సొంతంగా రిలీజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పూరి జగన్నాథ్ నిజంగానే తప్పుడు కేసు బనాయించారని ప్రూవ్ అయితే మాత్రం ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా పూరి తను తొందరపడిన విషయాన్ని గ్రహించి ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తే మంచిది.   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement