Advertisementt

బుడ్డోడు బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నాడు!

Mon 18th Apr 2016 08:36 PM
the jungle book,telugu vershion,100 crores  బుడ్డోడు బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నాడు!
బుడ్డోడు బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

ఉగాది నాడు అంటే సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ విడుదలైన రోజునే హాలీవుడ్‌ మూవీ ది జంగిల్‌ బుక్‌ కూడా విడుదలైంది. కాగా ఈ చిత్రం ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తూ.. ముఖ్యంగా చిన్నపిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోంది. హాలీవుడ్‌లో కంటే ఇండియాలో ఒక వారం ముందుగా విడుదలైన ఈ చిత్రంలో భారత సంతతికి చెందిన నీల్‌సోధీ అనే బుడ్డోడు బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నాడు. జాన్‌ ఫ్రెవీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో 100కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. గతంలో అవతార్‌, జురాసిక్‌ పార్క్‌, జురాసిక్‌ వరల్డ్‌, టైటానిక్‌ వంటి చిత్రాలు తెలుగులో విడుదలైనప్పటికీ ఇవి 100కోట్ల మార్కును చేరుకోలేకపోయాయి. ఇక మన దేశంలో 100కోట్ల మార్క్‌ను అందుకున్న తొలి చిత్రంగా ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7 చిత్రం రికార్డుల కెక్కింది. ఇప్పుడు ఆ సినిమాకు చేరువగా ది జంగిల్‌బుక్‌ నిలవనుంది. మొత్తానికి ఈ చిత్రం ద్వారా మన బుడ్డోడు బాక్సాఫీస్‌ను దున్నేస్తూ పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ