Advertisementt

పార్టీ మారిన వాళ్ళు మగాళ్ళట!

Mon 18th Apr 2016 05:24 PM
roja,ysrcp,tdp,jumping mlas,man,roja comments on jumping mlas  పార్టీ మారిన వాళ్ళు మగాళ్ళట!
పార్టీ మారిన వాళ్ళు మగాళ్ళట!
Advertisement
Ads by CJ

తెదేపాలో మగాళ్ళు లేరని, అందుకే వైకాపా నుండి మగాళ్ళు చేరుతున్నారని ఫైర్ బ్రాండ్ రోజా తీవ్ర ఆరోపణ చేశారు. మెుత్తానికి జండా మార్చిన తమ పార్టీ వాళ్ళు మగాళ్ళని ఆమె అంగీకరించారు. మరి ఈ మగాళ్ళు తెదేపాలోకి వెళుతుంటే పార్టీ అధినేత జగన్ ఏం చేస్తున్నారనేది మాత్రం రోజా వెల్లడించలేదు. కట్టడి చేయలేకపోతున్న జగన్ ను కూడా ఆమె ఏదో ఒక రోజు విమర్శించడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు పార్టీ మారిన వారిని రకరకాల పేర్లతో హేళన చేసేవారు. దీనికి భిన్నంగా రోజా అలాంటి వారు మగాళ్ళని సర్టిఫికెట్ ఇచ్చింది. విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ రోజా తీరు మాత్రం మారడం లేదు. అసెంబ్లీలో ప్రవేశం లేదు కాబట్టి తెదేపాపై తన అక్కసులు మైక్ దొరికిన చోటల్లా తీర్చుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రోజా తీరు ఇలాగే ఉంటే తాత్కాలికంగా ఆనందం అనిపించినా భవిష్యత్తులో వైకాపాకు తలనొప్పి రావడం ఖాయం. రోజా తీవ్ర విమర్శలు చేసినప్పుడల్లా చంద్రబాబు ఆకర్ష్ పథకానికి పదునుపెట్టి వైకాపా ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ