Advertisementt

అన్నీ బన్నీ.. చూస్తే బోయపాటి ఏం చేశాడు?

Mon 18th Apr 2016 04:48 PM
allu arjun,bunny,sarrainodu,boyapati sreenu,ss thaman  అన్నీ బన్నీ.. చూస్తే బోయపాటి ఏం చేశాడు?
అన్నీ బన్నీ.. చూస్తే బోయపాటి ఏం చేశాడు?
Advertisement
Ads by CJ

'బన్నీ (అల్లు అర్జున్)తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అతడికి మ్యూజిక్ సెన్స్ ఉంది. డిజెల గురించి తెలుసు. అతనితో పనిచేస్తుంటే తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. సాహిత్యం, కొరియోగ్రఫీ, లొకేషన్స్ అన్నీ చూసుకుంటాడు' అని  ' సరైనోడు' మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కితాబునిచ్చారు. తమన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. అన్నీ బన్నీ చూసుకుంటే బోయపాటి ఏం చేశాడనే అనుమానం వస్తోంది. నిశితంగా గమనిస్తే సరైనోడు తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది కాబట్టి బన్నీ ఎక్కువగా జోక్యం చేసుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. నో డౌట్! అల్లు అర్జున్ స్టార్ హీరో తన సినిమా బాగా రావాలనే ఉద్దేశం అతడిలో ఉంటుంది. ఇప్పటి వరకు ఇతర విభాగాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కానీ తమన్ మాటలను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో బన్నీ బాగా ఇన్ వాల్వు అయ్యారని స్పష్టమవుతుంది.
మెుదటి నుండి బోయపాటి పనితీరుపై యూనిట్ వర్గాలు అసంతృప్తిగానే ఉన్నాయి. 'సింహ', 'లెజెండ్' వంటి సూపర్ హిట్స్ తీసిన దర్శకుడితో సినిమా తీస్తున్న విషయాన్ని వారు ఎక్కడా ప్రచారం చేయకుండా జాగ్రత్తపడ్డారు. క్రెడిట్ అంతా అల్లు అర్జున్ కు వచ్చే విధంగానే ప్లాన్ చేశారు. తమన్ మాటలు కూడా వాటినే ధృవీకరిస్తున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ