Advertisement

అమితాబ్ ఆ పాత్రకు ఓకే చెప్తాడా..?

Fri 15th Apr 2016 07:52 PM
amitabh bachchan,oopiri remake,karan johar,varun dhavan  అమితాబ్ ఆ పాత్రకు ఓకే చెప్తాడా..?
అమితాబ్ ఆ పాత్రకు ఓకే చెప్తాడా..?
Advertisement

నాగార్జున, కార్తి ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఊపిరి'. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కరణ్ జోహార్ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి కొన్నారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. అయితే హిందీలో నాగార్జున పాత్రలో అమితాబ్ అయితే పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారని భావిస్తోన్న కరణ్ జోహార్ ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. వీల్ చైర్ కే పరిమితమయ్యే ఆ పాత్రలో నటించడానికి అమితాబ్ ఒప్పుకుంటాడో.. లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా కార్తి పాత్ర కోసం వరుణ్ ధావన్ ను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement