Loading...

రేష్మి ఎందుకిలా తయారైంది!?

'గుంటూరు టాకీస్‌' సినిమాలో 'జబర్దస్త్‌' యాంకర్‌ రేష్మి ఎంతగా రెచ్చిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రంలో ఆమె అందాల ఆరబోత ఆడియన్స్‌ను మరీ ముఖ్యంగా బి,సి సెంటర్ల ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఫ్లాప్‌ సినిమా అయినా సరే రేష్మి పుణ్యమా అని మంచి వసూళ్లు సాధించి సేఫ్‌ ప్రాజెక్ట్‌గా నిలిచింది ఈచిత్రం. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు 'అంతం' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె మరింత హాట్‌గా కనిపించనుంది. ఫస్ట్‌లుక్‌ నుండి తాజాగా విడుదలైన పోస్టర్స్‌లో ఆమెను చూసిన వారు మరీ ముఖ్యంగా ఆమె వీపు అందాలను చూసి యువత పిచ్చెక్కిపోతోంది. ఈ చిత్రాన్ని కూడా కేవలం రేష్మిని చూపించి బిజినెస్‌ చేస్తున్నారట. ఈ చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో కళ్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆమె అందమైన వీపుపై ఊహకు అందనిది జరుగబోతోంది అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. మరి ఈమె గ్లామర్‌ షో 'అంతం' కు ఎంతవరకు హెల్ప్‌ అవుతుందో వేచిచూడాల్సివుంది!. 

rashmi gautam
guntur talkies
antham
rashmi gautam hot movies
jabardasth fame