Advertisementt


రవితేజ గారు.. ఖాళీగానే వుంటారా..!

Wed 13th Apr 2016 10:15 AM
raviteja,bengal tiger,raviteja remuneration,yevado okadu,chakri  రవితేజ గారు.. ఖాళీగానే వుంటారా..!
రవితేజ గారు.. ఖాళీగానే వుంటారా..!
Advertisement
Ads by CJ

ఎందుకో తెలియదు కానీ ఇక.. రవితేజ సీజన్ అయిపోయిందేమో.. అనిపిస్తుంది..ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా వున్న ఈ మాస్ మహారాజా.. మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది.. ఇటీవల ‘బెంగాల్ టైగర్’ రూపంలో ఓ హిట్ వచ్చినా.. కేవలం రవితేజ వల్లే ఆ సినిమా కంటెంట్ కి తగిన వసూళ్లు రాలేదని అభిప్రాయపడ్డాయి ట్రేడ్‌వర్గాలు. అయితే రవితేజ మాత్రం తన పారితోషికాన్ని ఏ మాత్రం తగ్గించడం లేదు. అందుకే ‘బెంగాల్ టైగర్’ విడుదలై దాదాపు ఆరు నెలలు గడిచినా రవితేజ నటిస్తున్న చిత్రం ఏదీ సెట్స్ మీద లేదు. దిల్‌రాజు నిర్మాతగా మొదలుపెట్టిన ‘ఎవడో ఒకడు’ పారితోషిక విషయంలో తేడా వచ్చి ఆగిపోయింది. చక్రి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ ప్రకటనకే పరిమితమైంది. సో.. ఖాళీగానైనా వుంటాను తప్ప తన పది కోట్ల పారితోషికం విషయంలో రాజీపడేది లేదని గిరిగీసుకొని కూర్చున్నాడు ఈ క్రేజీస్టార్..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ