Advertisementt

మెగా దర్శకుడిగా ముద్ర పడినట్లేనా!

Tue 12th Apr 2016 03:00 PM
boyapati sreenu,chiranjeevi,mega compound,chiranjeevi 151th movie,nandamuri compound,simha,legend,balakrishna  మెగా దర్శకుడిగా ముద్ర పడినట్లేనా!
మెగా దర్శకుడిగా ముద్ర పడినట్లేనా!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణకు సింహా, లెజెండ్ లాంటి ఘనవిజయాలు అందించి..మరో నందమూరి హీరో ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ చిత్రాన్ని తెరకెక్కించిన  ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగా హీరో అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తొలినుంచి నందమూరి కాంపౌండ్ దర్శకుడిగా ముద్రపడిన బోయపాటి ఇక మెగా కాంపౌండ్ దర్శకుడిగా మారబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలుత బోయపాటి దర్శకత్వంలోనే తన 100వ చిత్రం చేస్తానని ప్రకటించిన బాలయ్య.. ఇప్పుడు ఆ అవకాశాన్ని ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రూపంలో దర్శకుడు క్రిష్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు బోయపాటిపై మెగా కాంపౌండ్ దృష్టిపెట్టింది. ఆదివారం వైజాగ్‌లో జరిగిన ‘సరైనోడు’ ఆడియో సక్సెస్ వేడుకలో చిరు మాట్లాడుతూ ‘సరైనోడు’ ప్రచార చిత్రం, పాటలు చాలా బాగున్నాయి. సినిమా తొందరగా చూడాలనే ఆసక్తి పెరిగిపోతుంది.  బోయపాటి శ్రీను ప్రతిభావంతుడైన మాస్ దర్శకుడు. నా 150వ చిత్రం తర్వాత కుదిరితే ఆయన  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను..అన్నాడు. సో.. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్‌ను బోయపాటి అందిపుచ్చుకున్నట్లే. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ