Advertisementt

చిరుకి వైజాగ్ లో స్థలం కావాలట!

Mon 11th Apr 2016 07:01 PM
chiranjeevi,sarainodu movie,vizag,abhilasha  చిరుకి వైజాగ్ లో స్థలం కావాలట!
చిరుకి వైజాగ్ లో స్థలం కావాలట!
Advertisement
Ads by CJ

'సరైనోడు' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం వైజాగ్ లో చాలా గ్రాండ్ గా జరింగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అభిలాష, ఆరాధన, చంటబ్బాయి, ఛాలెంజ్ ఇలా చాలా సినిమాలు వైజాగ్ లోనే చేశానని చెప్పారు. తనకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి వైజాగ్ లోనే సెటిల్ అవుదామనుకుంటున్నానని చెప్పారు. దీనికోసం చిరు తన ఫ్యాన్స్ ను చిన్న స్థలం చూసి పెట్టమని అడిగారు. విశాఖపట్టణం స్థానికుడిగా బ్రతకాలని ఉందని తన కోరికను వెల్లడించారు. చిరంజీవి మాటలు విన్న అభిమానులు తెగ సంబరపడిపోయారు. అలానే సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తే.. ఇండస్ట్రీ వైజాగ్ కు రావడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ