'సర్దార్‌' పై వర్మ ఆవేదన..!

Mon 11th Apr 2016 03:42 PM
sardaar gabbar singh,varma,ram gopal varma tweets on sardaar gabbar singh,rgv,bollywood entry of pawan kalyan  'సర్దార్‌' పై వర్మ ఆవేదన..!
'సర్దార్‌' పై వర్మ ఆవేదన..!
Advertisement

ఎవరెన్ని అనుకున్నా... వర్మ తన చిత్రాలను మార్కెటింగ్‌ చేయడంలో, సినిమాలకు క్రేజ్‌ తెచ్చే విధంగా పబ్లిసిటీ చేసుకోవడంలో జీనియస్‌ అన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. కాగా 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని పవన్‌ భావించిన తర్వాత వర్మ ఆయన్ను బాలీవుడ్‌కు వెళ్లవద్దు... నీ స్థాయి తగ్గిపోతుంది అక్కడ.. అంటూ గత కొంతకాలంగా పవన్‌ను హెచ్చరిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. కానీ వర్మ మాటలను పవన్‌ గానీ, ఆయన అనుచరగణం కానీ, అభిమానులు గానీ పట్టించుకోలేదు. కావాలని వెటకారం చేస్తున్నాడని భావించారు. సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా 'సర్దార్‌' చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్‌ చేశారు. కానీ ఇప్పుడు దాని ఫలితం కనిపిస్తోంది. హిందీలో 'సర్దార్‌' రిజల్ట్‌ చూసిన తర్వాత వర్మ మరోసారి ట్వీట్‌ చేశాడు. అప్పుడు నేను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని చెప్పుకొచ్చాడు. 'సర్దార్‌' హిందీ ఓపెనింగ్స్‌ కేవలం రెండు శాతం మాత్రమే జరిగిందని వర్మ ట్వీట్‌ చేశాడు. ముందే హిందీ పవన్‌కు వర్కౌట్‌ కాదని చెప్పాను. ఆయన చేస్తున్నది బాహుబలియన్‌ మిస్టేక్‌ అని మొత్తుకున్నాను. పవన్‌ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఆయన చుట్టూ ఉన్న వాళ్లే ఇలాంటి చెత్త సలహాలు ఇచ్చి ఆయన్ను చెడగొడుతున్నారు.. అంటూ వర్మ తన ఆవేదన వ్యక్తం చేశాడు.


Loading..
Loading..
Loading..
advertisement