'రాజా సర్దార్ గబ్బర్‌సింగ్' వుంటుందా?

Sat 09th Apr 2016 07:09 PM
raja sardaar gabbar singh,pawan kalyan,gabbar singh,sardaar gabbar singh,power star  'రాజా సర్దార్ గబ్బర్‌సింగ్' వుంటుందా?
'రాజా సర్దార్ గబ్బర్‌సింగ్' వుంటుందా?
Advertisement
Ads by CJ

‘గబ్బర్‌సింగ్’ అందించిన ఘనవిజయంతో పవన్‌కల్యాణ్ వరుసఫ్లాప్‌ల పరంపరకు తెరపడింది. అప్పటి వరకు నీరసంగా వున్న పవన్ అభిమానుల్లో సైతం ‘గబ్బర్‌సింగ్’ సాధించిన విజయం కొత్త హుషారును తెచ్చిపెట్టింది. పవన్‌కు కీలక సమయంలో వచ్చిన ఆ సక్సెస్‌కు సీక్వెల్‌ను రూపొందించాలనే ఆలోచన గబ్బర్‌సింగ్ షూటింగ్‌లోనే బీజం పడింది. పేరుకు ‘దబాంగ్’రీమేక్‌గా తెరకెక్కిన ఆ చిత్రంతో సంబంధం లేకుండా ‘గబ్బర్‌సింగ్’ను తెరకెక్కించాడు దర్శకుడు హరీష్‌శంకర్. అయితే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. పవన్ మరో సూపర్‌హిట్‌ను కొడతాడనే అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా పూర్తయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ కంటే ముందు త్వరలో  ‘రాజా సర్దార్ గబ్బర్‌సింగ్’గా రాబోతున్నట్లుగా టైటిల్స్ వేశారు. అయితే ఇప్పుడు సినిమా ఫలితం తేడాగా వుండటంతో.. రాజా సర్దార్ గబ్బర్‌సింగ్ రావడం అనుమానమే అంటున్నారు సినీవర్గాలు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ