కావాలి.. అనుకుంటే ఎంతైనా ఇచ్చేస్తాడు!

Sat 09th Apr 2016 11:45 AM
vishal,nannaku prematho,rakul preet singh,jagapathi babu  కావాలి.. అనుకుంటే ఎంతైనా ఇచ్చేస్తాడు!
కావాలి.. అనుకుంటే ఎంతైనా ఇచ్చేస్తాడు!
Advertisement
Ads by CJ

హీరో విశాల్‌ చిత్రం అంటే టెక్నీషియన్స్‌, హీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు... ఇలా అందరూ ఎగిరి గంతేస్తారు. కానీ అది విశాల్‌కు ఉన్న క్రేజ్‌ను చూసి కాదు... ఆయన చిత్రాల్లో పనిచేసే వారికి ఆయన ఇచ్చే భారీ రెమ్యూనరేషన్‌ చూసి అందరు ఆయనతో చేయాలని భావిస్తుంటారు. ఫలానా క్యారెక్టర్‌ను ఫలానా ఆర్టిస్ట్‌ చేస్తే తన చిత్రానికి హైప్‌ వస్తుందని భావిస్తే.. వారు ఎంత డిమాండ్‌ చేసినా ఇచ్చి తన చిత్రంలోకి తీసుకుంటాడు. ఈ విషయంలో విశాల్‌ నిర్మాతగా మంచి పేరు ఉంది. కాగా ఇటీవల వచ్చిన 'నాన్నకుప్రేమతో' చిత్రంలో జగపతిబాబు, రకుల్‌ప్రీత్‌సింగ్‌లను చూసిన ఆయన ఆ ఇద్దరు తన తాజా చిత్రంలో నటిస్తే తన సినిమాకు తెలుగులో బాగా హెల్ప్‌ అవుతుందని భావించాడట. ఇప్పటికే 'తాండవం, లింగా' వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైన జగపతి ప్రస్తుతం తమిళంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. మొత్తానికి విశాల్‌ జగపతికి భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చి తన చిత్రంలో కూడా విలన్‌గా తీసుకున్నాడని సమాచారం. మామూలుగా జగపతి తీసుకునే రెమ్యూనరేషన్‌కు రెండు రెట్లు ఎక్కువగా ఇచ్చాడట. అలాగే రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కూడా తన చిత్రంలో తీసుకోవాలని భావిస్తున్న ఆయన ఆమెకు సైతం భారీ ఆఫర్‌ రెడీ చేశాడట. కాగా ఈ చిత్రానికి మిస్కిన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ