Advertisement

బాలయ్య నిర్మాతలు సాహసం చేస్తున్నారా!

Thu 07th Apr 2016 10:53 AM
balakrishna,gouthamiputra sathakarni,krishna,moracco,balayya  బాలయ్య నిర్మాతలు సాహసం చేస్తున్నారా!
బాలయ్య నిర్మాతలు సాహసం చేస్తున్నారా!
Advertisement

100 చిత్రాల మైలురాయి. ఇది నేటి యంగ్‌ స్టార్స్‌ అయిన మహేష్‌, పవన్‌, ప్రభాస్‌.. ఇలా ఏ స్టార్‌కు కూడా నేటితరంలో ఇది సాధించే అవకాశం లేదు. అయితే చిరంజీవి తర్వాత బాలకృష్ణ వంటి సీనియర్‌ స్టార్‌ మాత్రమే ఆ మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. కాగా బాలయ్య నటించే 100వ చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి' జీవిత కథ ఆధారంగా ఓ హిస్టారికల్‌ మూవీని తన సెంచరీ చిత్రంగా ఎంచుకొన్నాడు బాలయ్య. దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌ను కూడా క్రిష్‌ ఆల్రెడీ రిజిష్టర్‌ చేయించేశాడు. కాగా ఈచిత్రాన్ని క్రిష్‌ తన సొంతబేనర్‌ అయన 'ఫస్ట్‌ఫ్రేమ్‌' పతాకంపై సాయికొర్రపాటి వారాహిచలన చిత్రం సంయుక్త నిర్మాణంలో తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రం చారిత్రాత్మక చిత్రం కావడం, ఆనాటి వాతావరణాన్ని, సమాజాన్ని ప్రతిబింబించేలా చూసేందుకు క్రిష్‌ ఈ చిత్రం కోసం భారీ సెట్స్‌ను వేయనున్నాడు. కాగా ఇటీవల క్రిష్‌ తీసిన 'కంచె' చిత్రం కోసం రెండవ ప్రపంచయుద్ద కాలాన్ని తలపించేలా జార్జియా వంటి దేశాల్లో చిత్రీకరణ జరిపిన క్రిష్‌ ఈ చిత్రం కోసం విదేశాల్లో లొకేషన్ల వేట కోసం ఆఫ్రికా దేశాలతోపాటు పలు దేశాలను తిరుగుతున్నాడు. కాగా ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఎక్కువగా మొరాకో దేశంలో చిత్రీకరించాలని ఫైనల్‌ చేశాడని సమాచారం. ఆనాటి పరిస్థితులను ప్రతిబింబించేలా భారీ సెట్స్‌ వేయడానికి పూనుకోవడంతో ఈ చిత్రానికి 50కోట్లను మించిన బడ్జెట్‌ ఖర్చుకానుందని తెలుస్తోంది. అయితే ఇంత భారీ మొత్తం బాలయ్య సినిమాపై పెట్టడం రిస్కేనని కొందరు ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ఇప్పటివరకు బాలయ్య కెరీర్‌లో 'లెజెండ్‌' తప్ప ఏ చిత్రం కూడా 40కోట్లు కూడా దాటలేకపోయింది. ఇక అదే సమయంలో దర్శకుడు క్రిష్‌ అద్బుతమైన చిత్రాలు తీస్తాడనే పేరు ఉన్నప్పటికీ ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు భారీ కమర్షియల్‌ హిట్‌ లేదు. దీంతో బాలయ్య వందో చిత్రానికి ఇంతటి బడ్టెట్‌ పెట్టడం రిస్కేనని ట్రేడ్‌ పండితులు అంచనాలు వేస్తుంటే వర్కవుట్‌ అయితే మాత్రం ఇది పెద్ద రిస్కేం కాదని నందమూరి ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. కాగా ఈచిత్రాన్ని ఈనెల 8న ఉగాదినాడు అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసి ఈనెల 22 నుండి పట్టాలెక్కించున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement