ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సెలబ్రిటీ అయినా ఫైన్ కట్టాల్సిందే!

ఈ రోజు (ఏప్రిల్ 6) హైదరాబాద్ నగరం లో ఆర్డీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అక్కడక్కడ వాహనాల తనిఖీలు చేపట్టారు. సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాహనానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కారుకి బ్లాక్ స్టిక్కర్ వాడారని, బ్లాక్ స్టిక్కర్ ను హైకోర్ట్ నిబంధనల మేరకు వాడకూడదు అని రూల్ వుండటం వల్ల ఎన్టీఆర్ కారుకి రూ.700 జరిమానా విధించారు. ఆ టైంలో ఎన్టీఆర్ కారులోనే వున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డ్రైవర్ ఆ ఫైన్ చెల్లించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సో...చట్టం ముందు ఎవరైనా ఒకటే అనేది మరోసారి నిరూపితమైంది.
jr ntr
celebrity
special drive
traffic police
fine
fine 700
car black sticker







































