Advertisementt

ఎన్టీఆర్ తన పద్ధతి మార్చుకున్నాడు!

Tue 05th Apr 2016 04:56 PM
ntr,hanu raghavapudi,janatah garage,vakkantham vamsi  ఎన్టీఆర్ తన పద్ధతి మార్చుకున్నాడు!
ఎన్టీఆర్ తన పద్ధతి మార్చుకున్నాడు!
Advertisement
Ads by CJ

మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా పెట్టుకొని ఇప్పటివరకు అదే తరహా చిత్రాల్లో నటిస్తూ.. మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇప్పుడిప్పుడే తన పద్ధతిని మార్చుకుంటూ.. క్లాస్ ఇమేజ్ వైపు మొగ్గు చూపుతున్నాడు. 'టెంపర్','నాన్నకు ప్రేమతో' చిత్రాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవే.. ఆ రెండు చిత్రాలకు మంచి పేరు రావడంతో అదే తరహాలో ఉండే చిత్రాల్లో నటించడానికి ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా 'కృష్ణగాడి వీరప్రేమ గాధ' సినిమాతో హిట్ కొట్టిన హను రాఘవపుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే హను, ఎన్టీఆర్ కు ఒక లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడట. కథను డెవలప్ చేసే పనిలో ఉన్నాడు హను రాఘవాపుడి. ఇదొక రొమాంటిక్ లవ్ స్టొరీ అని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ పూర్తి స్థాయి ప్రేమ కథలో ఎలా నటిస్తాడో.. చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ తో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ రెండు చిత్రాల తరువాత హను, ఎన్టీఆర్ ల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ