Advertisementt

బాలయ్య నిర్మాత హ్యాండ్ ఇచ్చాడు..!

Mon 04th Apr 2016 07:51 PM
balakrishna,krish,yodhudu movie,sai korrapati  బాలయ్య నిర్మాత హ్యాండ్ ఇచ్చాడు..!
బాలయ్య నిర్మాత హ్యాండ్ ఇచ్చాడు..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'యోధుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. క్రిష్ ఈ సినిమాను భారీగా రూపొందించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికోసం దాదాపు 70 కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనా వేశాడు. బాలయ్యతో 'లెజెండ్' చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే సాయి కొర్రపాటి మాత్రం బాలయ్యపై అన్ని కోట్ల మార్కెట్ వర్కవుట్ కాదని భావించాడు. 'లెజెండ్' సినిమా 40 కోట్లు కూడా క్రాస్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్యపై 70 కోట్లు పెట్టడం రిస్క్ అని భావించిన సాయి కొర్రపాటి ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య 100 వ చిత్రం నిర్మాతగా మరెవరు రంగంలోకి దిగుతారో చూడాలి..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ