Advertisementt

పోలీసోడుకి ఎన్టీఆర్ సపోర్ట్ అందిస్తున్నాడు!

Mon 04th Apr 2016 04:38 PM
ntr,polisodu movie,vijay,dil raju,teri  పోలీసోడుకి ఎన్టీఆర్ సపోర్ట్ అందిస్తున్నాడు!
పోలీసోడుకి ఎన్టీఆర్ సపోర్ట్ అందిస్తున్నాడు!
Advertisement
Ads by CJ

ఇళయదలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేరీ'. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో 'పోలీసోడు' పేరుతో ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుందని సమాచారం. తెలుగు రైట్స్ ను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు. విజయ్ కు తెలుగులో అంతగా మార్కెట్ లేదు. తను నటించిన 'తుపాకీ' తప్ప మరే సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో తను నటించిన 'పోలీసోడు' చిత్రానికి హైప్ తీసుకురావడానికి జూనియర్ ఎన్టీఆర్ ను ప్రమోషన్స్ కు వాడుకోవాలని భావిస్తున్నారు. దిల్ రాజు స్వయంగా ఎన్టీఆర్ ను ఆడియో విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న ఈ ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ వస్తానని మాటిచ్చాడట. సో.. పోలీసోడుకి తెలుగులో మంచి ప్రమోషన్ దొరికిందనే చెప్పాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ