Advertisementt

కక్ష కట్టి మంచుఫ్యామిలీకి ఫ్లాప్ లు ఇచ్చాడా!

Mon 04th Apr 2016 11:36 AM
ram gopal varma,manchu family,rgv,vishnu,mohan babu,manoj,manchu lakshmi prasanna,flops  కక్ష కట్టి మంచుఫ్యామిలీకి ఫ్లాప్ లు ఇచ్చాడా!
కక్ష కట్టి మంచుఫ్యామిలీకి ఫ్లాప్ లు ఇచ్చాడా!
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ కావాలని చేశాడా లేక అలా జరిగిందా... ఈ విషయం మంచు ఇంట్లో చర్చనీయాంశమైందట. విషయం ఏమంటే వర్మ మంచి ఫామ్ లో ఉన్నపుడు గుర్తుకురాని టాలీవుడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వారిలో మంచు మోహన్ బాబు కూడా ఒకరు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు మకాం మార్చాక వర్మ దృష్టి మంచు కుంటుంబంపై పడింది. తన సినిమాలకు పెట్టుబడి పెట్టే వాళ్ళు దొరికారని భావించాడో ఏమో ఏదో ఒక్కో కథ చెప్పేసి వారిని ఒప్పించసాగాడు. మోహన్ బాబుతో 'రౌడీ', విష్ణుతో 'అనుక్షణం', మనోజ్ తో 'ఎటాక్', మంచు లక్ష్మీతో 'దొంగలముఠా', మరొక షార్ట్ ఫిల్మ్ తీశాడు. పేర్లు చదివితేనే తెలుస్తోంది. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలే అని. కావాలని కక్ష కట్టి మంచు ఫ్యామిలీకి వరుసగా ఫ్లాప్ లు తీసిపెట్టిన ఘనత వర్మకు చెందుతుంది. సక్సెస్, ఫెయిల్యూర్ దర్శకుడి బాధ్యతని తరచుగా మోహన్ బాబు చెబుతుంటారు. ఆ ప్రకారం ఫ్లాప్ లకు వర్మ బాధ్యుడన్నమాట. అసలే హీరోలుగా నిలదొక్కకోవడానికి నానా తంటాలు పడుతున్న మంచు బ్రదర్స్ (విష్ణు, మనోజ్)కు వర్మ షాక్ ల మీద షాక్ లిచ్చాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ