బాలకృష్ణ తల్లిగా బాలీవుడ్ నటి!

Thu 31st Mar 2016 05:20 PM
balakrishna,hema malini,krish,nayanatara  బాలకృష్ణ తల్లిగా బాలీవుడ్ నటి!
బాలకృష్ణ తల్లిగా బాలీవుడ్ నటి!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, క్రిష్ దర్శకత్వంలో గౌతమీ పుత్ర శాతకర్ణి కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు క్రిష్. ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. దీనికోసం క్రిష్ మొదట నటి శోభన లేదా హేమామాలిని ను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు. శోభన ఇదివరకు బాలయ్య సరసన హీరోయిన్ నటించింది కాబట్టి తనను తల్లి పాత్రలో తీసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కనుక చిత్రబృందం హేమా మాలిని నే తల్లి పాత్రలో ఖారారు చేసినట్లుగా సమాచారం. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ను అనుకున్నారు కానీ ఆమె తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పేసింది. మరి హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో.. చూడాలి!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ