Advertisementt

పూరితో నారా రోహిత్..?

Wed 30th Mar 2016 07:34 PM
puri jagannath,nara rohit,kalyan ram,rouge  పూరితో నారా రోహిత్..?
పూరితో నారా రోహిత్..?
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్ తో నారా రోహిత్ సినిమా చేయనున్నాడా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. వరుస సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ ఫాంలో ఉన్న నారా రోహిత్ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. హీరోల క్యారెక్టరైజేషన్స్ రాయడంలో పూరికు ప్రత్యేకమైన శైలి ఉంది. పూరి జగన్నాథ్ మాత్రమే తనకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చే సినిమా చేయగలడని భావించిన రోహిత్, పూరి జగన్నాథ్ ను కలిసినట్లు తెలుస్తోంది. తనతో సినిమా చేయమని అడిగిన రోహిత్ కు పూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరో కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేసే పనిలో ఉన్నాడు. అలానే 'రోగ్' సినిమాను తీర్చిదిద్దుతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత నారా హీరోతో పూరి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో అయినా.. రోహిత్ కు మాస్ క్రేజ్ వస్తుందేమో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ