Advertisementt

సీనియర్ నిర్మాత జయకృష్ణ ఇక లేరు!

Wed 30th Mar 2016 01:46 PM
senior producer jayakrishna,krishnam raju,chiranjeevi   సీనియర్ నిర్మాత జయకృష్ణ ఇక లేరు!
సీనియర్ నిర్మాత జయకృష్ణ ఇక లేరు!
Advertisement
Ads by CJ

రెబెల్ స్టార్ కృష్ణంరాజు, హీరోయిన్ విజయశాంతిలకు మేకప్ మ్యాన్ గా పని చేసి ఆ తరువాత నిర్మాతగా మారారు జయకృష్ణ. 1978 లో మనవూరి పాండవులు అనే చిత్రాన్ని నిర్మించి ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత మంత్రి గారి వియ్యంకుడు, వివాహ భోజనంబు, ముద్దుల మనవరాలు, సీతారాములు, రాగలీల, నీకు నాకు పెళ్ళంట,  కృష్ణార్జునులు ఇలా ఎన్నో చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి కు మొదటిసారి 1116 రూపాయలను రెమ్యునరేషన్ గా ఇచ్చిన నిర్మాతాయన. జయకృష్ణ గారికి సుమారుగా 67 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు. ఈ కారణంతోనే ఈరోజు మధ్యాహ్న సమయంలో ఆయన మరణించారు. రేపు(బుధవారం) హైదరాబాద్ లో అంత్యక్రియలు జరపబోతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ