మొత్తానికి.. సుడిగాడు అంటే సునీలే!

Sun 27th Mar 2016 05:55 PM
sunil,sudidagdu,eedu gold ehe,jakkanna,kranthi madhav,sunil movies  మొత్తానికి.. సుడిగాడు అంటే సునీలే!
మొత్తానికి.. సుడిగాడు అంటే సునీలే!
Sponsored links

హిట్‌ ఇచ్చిన హీరోలకే సరిగా అవకాశాలు రావడం లేదు. కానీ ఈ మధ్యకాలంలో వరసగా అపజయాలు ఎదురవుతున్నప్పటికీ హీరో సునీల్‌కు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల దిల్‌రాజు వంటి నిర్మాత తీసిన 'కృష్ణాష్టమి' కూడా ఘోరపరాజయం పాలైంది. దీంతో ఇక అందరూ సునీల్‌ పనైపోయిందని భావించారు. కానీ ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండటం విశేషం. ఇలా సునీల్‌ను అదృష్టం దురదుష్టంగా వెంటాడుతోంది. మరి ఆయన ఏ మాయచేస్తున్నాడో అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో 'జక్కన్న' చిత్రం చేస్తున్నాడు. మరోవైపు వీరుపోట్ల దర్శకత్వంలో 'వీడు గోల్డ్‌ ఎహె' చిత్రం చేస్తున్నాడు. తాజాగా సునీల్‌ 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు' వంటి ఫీల్‌గుడ్‌ చిత్రాల దర్శకుడు క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సునీల్‌తో సినిమాలు చేయడానికి పలువురు సిద్దంగా ఉన్నప్పటికీ సునీల్‌ మాత్రం తొందపడకుండా పక్కాగా తనకు బాగా నచ్చిన చిత్రాలనే ఎంచుకుంటున్నాడు. మొత్తానికి సుడిగాడు అంటే సునీలే అని చెప్పవచ్చు. మరో పక్క మరలా కమెడియన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మొత్తం మీద హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు ఈ భీమవరం బుల్లోడు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019