Advertisementt

ఆ రెండు సినిమాలపై రోహిత్ ఆశలు...!

Sat 26th Mar 2016 08:24 PM
nara rohit,thuntari,savithri,raja cheyyi vesthe  ఆ రెండు సినిమాలపై రోహిత్ ఆశలు...!
ఆ రెండు సినిమాలపై రోహిత్ ఆశలు...!
Advertisement
Ads by CJ

నీ పని నువ్వు చేయి.. ఫలితం మాత్రం ఆశించకు... అని శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశాన్ని నారా వారి అబ్బాయి తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాడు. ఇటీవల విడుదలైన 'తుంటరి' చిత్రం కూడా సో...సో.. అనిపించింది. కాగా ఏప్రిల్‌ 1న విడుదల కానున్న 'సావిత్రి' చిత్రంపై ఇప్పుడు రోహిత్‌ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఇందులో ఆయన సరసన నందిత నటిస్తోంది. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' చిత్ర దర్శకుడు పవన్‌ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ బోర్డ్‌ నుంచి క్లీన్‌ యు సర్టిఫికేట్‌ సంపాదించింది. వాస్తవానికి సెంటివెంట్‌ పరంగా చూసినా కూడా లేడీ ఓరియంటెడ్‌ టైటిల్స్‌తో వచ్చిన హీరోల చిత్రాలు తెలుగులో బాగా ఆడాయి. 'లక్ష్మీ, తులసి' వంటి చిత్రాలే దీనికి ఉదాహరణ. ఈ సెంటిమెంట్‌ తనకు కూడా వర్కౌట్‌ అవుతుందని నారా వారి అబ్బాయి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. కాగా ఈ చిత్రం కంటే వారాహి చలన చిత్రం సంస్థ అధినేత సాయికొర్రపాటి నారారోహిత్‌ హీరోగా, నందమూరి తారకరత్న విలన్‌గా నటించిన 'రాజా చేయి వేస్తే' చిత్రంపైనే అందరికీ ఆశలు ఉన్నాయి. మరి ఈ రెండు చిత్రాలతో తొలి బ్లాక్‌బస్టర్‌ అందుకోవడానికి రోహిత్‌ చకోరపక్షిలా ఎదురుచూస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ