కేకపుట్టిస్తోన్న అక్షయ్‌ లుక్‌..!

Fri 25th Mar 2016 01:52 PM
akshay kumar,robo2,rajinikanth,shankar  కేకపుట్టిస్తోన్న అక్షయ్‌ లుక్‌..!
కేకపుట్టిస్తోన్న అక్షయ్‌ లుక్‌..!
Advertisement
Ads by CJ

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా, అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తున్న 'రోబో2.0' చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. కాగా ఈచిత్రంలో అక్షయ్‌కుమార్‌ ఓ సైంటిస్ట్‌ పాత్రను చేస్తున్నాడు. ఈ పాత్రను చాలా డిఫరెంట్‌గా రూపొందిస్తున్నారు. తనపై తానే ప్రయోగాలు చేసుకుని కాకిలాగా మారిన రూపంలో అక్షయ్‌ కనిపిస్తున్న పొటోలు లీక్‌ అయ్యాయి. అతడికి కాకి గెటప్‌ వేసారు. బ్లాక్‌ కలర్‌ డ్రస్‌, పెద్ద కనుబొమ్మలు, వెరైటీ కనుగుడ్లు, వైట్‌ హెయిర్‌స్టైల్‌తో చూడాగానే భయం కలిగించేలా ఉంది అక్షయ్‌ గెటప్‌. ఈ లుక్‌ చూసిన వారందరూ షాక్‌కు గురవ్వుతున్నారు. కాగా శంకర్‌ సినిమా అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా అని అంటున్నారు. 'ఐ' చిత్రంలో విక్రమ్‌ను ఎలుగుబంటి గెటప్‌తో చూపించిన శంకర్‌ తన తాజా చిత్రం 'రోబో2.0' లో కూడా అందరు ఆర్టిస్ట్‌లను సరికొత్తగా చూపించనున్నాడని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ