Advertisementt

తేరీ ఇరగేసింది అంతే!

Tue 22nd Mar 2016 06:44 PM
theri trailer,vijay,samanta,atlee  తేరీ ఇరగేసింది అంతే!
తేరీ ఇరగేసింది అంతే!
Advertisement
Ads by CJ

ఇప్పుడే ట్రైలర్లు, యూ ట్యూబు రికార్డుల గురించి చర్చిస్తున్నామో లేదో అప్పుడే తమిళంలో నిన్న సాయంత్రం రిలీజయిన విజయ్ తేరీ చిత్రం ట్రైలర్ కుమ్మేస్తున్న సంగతి తెలిసొచ్చింది. అట్లీ దర్శకుడిగా విజయ్, సమంతా, యామీ జాక్సన్ ముఖ్య తారాగణంతో కలైపులి ఎస్ తాను నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ఏప్రిల్ మూడో వారంలో విడుదలవనుంది. ఆడియోతో పాటు సరిగ్గా నిన్నే తేరీ ట్రైలర్ కూడా వదిలారు నిర్మాతలు. అత్యద్భుతమైన క్వాలిటీతో అమోఘమైన విజువల్స్, విజయ్ నటన, హీరోయిన్ల అందాలతో పాటుగా బాలనటి నైనిక ప్రెజెన్స్ తేరీ మీద అంచనాలని ఆకాశానికి ఎత్తేసాయి. ఈ నైనిక ఎవరో కాదు. ఒకప్పటి హీరోయిన్ మీనా కూతురు. ఇక తేరీలో విజయ్ ద్విపాత్రాభినయం చేయడం మరో అసెట్. ఇప్పటికే ఈ ట్రైలరుని వీక్షించిన వారి సంఖ్య 2 మిలియన్స్ తాకుతోంది అంటే ఏ స్థాయిలో తమిళ జనానికి విజయ్ ఫీవర్ పట్టుకుందో అర్థమవాలి. ఓ సినిమా మీద మార్కెట్టు అంచనాలను ఎలా పెంచాలో సరిగ్గా అలాగే ఈ ట్రైలరుకి కూర్పు చేయడం జస్ట్ సూపర్బ్ అనే చెప్పాలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ