సర్ధార్‌ ఆడియో పాసులన్నీ మంత్రుల చేతుల్లోనే!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రెస్టీజీయస్‌గా తెరకెక్కుతున్న సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్ర ఆడియో ఈ ఆదివారం విడుదల కానుంది. అయితే ఈ ఆడియోకి సంబంధించి ఆడియో ఫంక్షన్‌ను జరపాలా! వద్దా..! అనే సందిగ్ధం నుండి..నోవాటెల్‌లో ఫంక్షన్‌ జరిపేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే ఆడియో విడుదలకు ముందే పవన్‌కళ్యాణ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి..పాసులు లేకుండా ఆడియోకి అభిమానులు రావద్దు అంటూ తెలియజేశాడు. అయితే ఈ ఆడియో పాసుల వెనుక పెద్ద కహానీయే జరిగిందని, అందువల్లే పవన్‌కళ్యాణ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఫ్యాన్స్‌కి విన్నపం చేశాడని తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే..'సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌' ఆడియోకి సంబంధించి, అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణలోని కొందరు మంత్రులు.. ముందే ఒక్కొక్కరు 100 పాస్‌ల చొప్పున తీసేసుకున్నారట. వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించిన పర్సన్స్‌ ఈ ఆడియోకి వస్తుండటంతో..కావాలనే ఫ్యాన్స్‌ని ఈ ఫంక్షన్‌కి దూరం చేసినట్లుగా తెలుస్తుంది. అందువల్లే పవన్‌ ముందు జాగ్రత్తగా..ఫ్యాన్స్‌కి ఈ సమాచారం చేరవేసినట్లుగా టాక్‌. నోవాటెల్‌ సెక్యూరిటీ దృష్ట్యానే కాకుండా..ఫ్యాన్స్‌కి పాసులు ఇవ్వకపోవడానికి ఇదొక కారణంగా ఇండస్ట్రీలో న్యూస్‌ నడుస్తోంది.

sardaar gabbar singh
pawan kalyan
power star
ministers
sardaar gabbar singh audio function
passes