Advertisementt

ఎన్టీయార్ బాగానే ఉన్నాడు!

Thu 17th Mar 2016 01:10 PM
jr ntr,janatha garage accident news  ఎన్టీయార్ బాగానే ఉన్నాడు!
ఎన్టీయార్ బాగానే ఉన్నాడు!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీయార్ పై ఈరోజు పొద్దున నుండి వస్తున్న యాక్సిడెంట్ పుకార్లకు ఇంక అభిమానులు బాధ పడాల్సిన, భయ పడాల్సిన పని లేదు, అంతకంటే చెప్పాలంటే వాటిని నమ్మాల్సిన అవసరం అసలే  లేదు. ఎవరో పనిలేని సోమరిపోతులు పుట్టించిన ఈ పుకార్లకు తారక్ ఫ్యాన్స్ నిజంగానే ఓ క్షణం ఉలిక్కి పడ్డారు. జనత గ్యారేజీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యొక్క లోగో వేసేసుకుని, సోషల్ మీడియాలో ఓ ట్విట్టర్ ఎకౌంటు ఓపెన్ చేసి అదే పనిగా నందమూరి అభిమానులను టార్గెట్ చేసేలా ఈ ట్వీట్  చేసారంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే అంటున్నారు తారక్ ఫ్యాన్స్. ఏదైతే ఏమిటి, సదరు నిర్మాణ సంస్థ వారు క్లారిటీ ఇచ్చే పనిలో భాగంగానే తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ ఇదని తెలియజేస్తూ, మిగతా ఏ ట్విట్టర్ అకౌంట్ నుండి సమాచారం వచ్చినా నమ్మొద్దని విజ్ఞ్యప్తి చేసారు. సో, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. జనతా గ్యారేజీ ముంబై షెడ్యూల్ షూటింగ్ బ్రహ్మాండంగా జరుగుతోంది అండ్ ముఖ్యంగా ఎన్టీయార్ ఈజ్ సేఫ్. ఆగష్టు మొదటి లేదా రెండో వారంలో సినిమా విడుదలకు కూడా సిద్ధం కానుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ