Advertisementt

PVP ఊపిరి లెక్క సరిగ్గానే ఉందిగా!

Mon 14th Mar 2016 12:23 PM
oopiri trailer,thozha trailer,nagarjuna,karthi  PVP ఊపిరి లెక్క సరిగ్గానే ఉందిగా!
PVP ఊపిరి లెక్క సరిగ్గానే ఉందిగా!
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళం కలిపి 50 కోట్లు ఖర్చుబెట్టి తీసిన లావిష్ చిత్రం ఊపిరి. ఈ నెల 25న రిలీజుకు సిద్ధమవుతున్న ఈ గ్రాండ్ మూవీలో నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్ ముఖ్య తారాగణం. నాగార్జునను అవిటివాడిని చేసి ఓ కుర్చీకి పరిమితం చేసిన ఈ చిత్ర కథ ఓ ఫ్రెంచ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. నాగ్ ఎంతలా గౌరవాన్ని చాటిచెప్పే మనసున్న కోటీశ్వరుడు పాత్రలో నటించాడో, అంతలా అల్లర చిల్లరగా ఫన్నీగా ఉండే స్లం డాగ్ క్యారెక్టర్ మరో హీరో కార్తీది. ఈ కలయిక వెనక బాక్సాఫీస్ రీజనే ఇక్కడ తెలుగులో నాగార్జున వ్యాల్యూ మీద, అక్కడ తమిళంలో కార్తీ క్రేజు మీద పబ్లిక్కును పుల్ చేయాలని. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థ PVP వాళ్ళు మొన్న వదిలిన తెలుగు ట్రైలర్ నాగార్జునలోని ఎమోషన్ బేస్ చేసుకొని కట్ చేస్తే, తమిళంలో మాత్రం కార్తీ సరదా క్యారెక్టర్ మీదే కేంద్రీకృతం అయింది. ఎక్కడి వారిని అక్కడే, ఆయా హీరోలతో కొడితేనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న ఫార్ములా బాగా వాడేసారు. మరి ట్రైలర్ వరకే ఇలా ఉంటుందా లేక సినిమా కూడా తెలుగు వర్షన్ పూర్తిగా నాగార్జున మీద ఆధారపడడం; తమిళ వర్షన్ కార్తీ పైన రన్ అవుతుందా? మరో పది రోజులు ఆగితే  అన్నీ తెలిసిపోతాయి. తెలుగు ఊపిరికి తమిళ టైటిల్ తొళ.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ