సర్దార్, అంతా ఫ్యాన్స్ మహిమే!

Mon 14th Mar 2016 09:42 AM
sardaar gabbar singh,promotions,anupama interview  సర్దార్, అంతా ఫ్యాన్స్ మహిమే!
సర్దార్, అంతా ఫ్యాన్స్ మహిమే!
Sponsored links

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓ అందరికీ నచ్చేయాలన్న రూలేమీ లేదు. కనీసం ఆయన అభిమానులు మొత్తంగా ఓసారి చూసేసినా ఆ సినిమా సూపర్ హిట్టు కిందే లెక్క అన్నటుగా ఉంటాయి ఈయన ఫ్యాన్స్ సంగతులు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆది నుండి ఇప్పటిదాకా ఫ్యాన్స్ అందరూ సంబూర పడిపోయేలా ఒక్క న్యూస్ కూడా రాకపోవడం మనకు తెలియనిది కాదు. EROS వాళ్ళు వచ్చారు, సినిమాను కొన్నారు అన్న ఓ వార్త తప్ప అభిమానులు ఉర్రూతలూగిపోయేలా చేసింది మరేమీ లేదు. దీనికి తోడు షూటింగ్ కనీసం ఓ ఏడాది లేటవడం, ఇంతలో పవన్ పేరును రాజకీయ ఎత్తుగడల కోసం వాడడంతో కాస్తంత మెరుపు తగ్గింది. అందుకే వచ్చే వారం సర్దార్ ఆడియో పండక్కి ముందుగా ఫ్యాన్సుని మోపు చేసి, మళ్ళీ పవర్ స్టార్ పేరుని సానపెట్టే పనిలో భాగంగానే అనుపమ ఇంటర్వ్యూ వీడియోని సోషల్ మీడియాలో ఈ రోజు ప్రవేశపెట్టారని తెలుస్తోంది. ఇది మొదలు, తరువాత సర్దార్ పాటలు, అటు తరువాత ట్రైలర్, ఆ తరువాత రిలీజ్ హడావిడి... రానుంది మొత్తం ప్రమోషన్ పండగ వాతావరణమే. సర్దార్ గబ్బర్ సింగ్ హడావిడి నిజంగా ఈ ఇంటర్వ్యూతోనే ఆరంభం అయిందని స్పష్టంగా తెలిసేలా ప్లాన్ చేసారు నిర్మాతలు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019