Advertisementt

కష్టాలు అప్పుడే మొదలయ్యయా కీర్తి!

Sat 12th Mar 2016 02:23 PM
keerthi suresh,nenu sailaja,thani oruvan,ram charan  కష్టాలు అప్పుడే మొదలయ్యయా కీర్తి!
కష్టాలు అప్పుడే మొదలయ్యయా కీర్తి!
Advertisement
Ads by CJ

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలన్నీ సూపర్ హిట్స్, దాంతో పాటు ఈ భామకు క్రేజీ కూడా అమాంతం పెరిగింది. దాంతో హీరోయిన్ గా తనకు తిరుగులేదనే ప్లాన్ తో కాస్త బెట్టు చేయడం మొదలు పెట్టింది. వస్తున్నా అవకాశాలతో ఇలా చేయను , అలా చేయను , గ్లామర్ కు దూరం అంటూ నానా కండిషన్స్ పెట్టింది. అసలే గ్లామర్ ఫీల్డ్  ఈ ఫీల్డ్ లో నిలబడాలంటే గ్లామర్ తప్పనిసరి కావలసిందే? లేదు నేను గ్లామర్ పాత్రలు చేయను అంటూ కండిషన్స్ పెట్టింది  నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రి ఇచ్చిన మలయాళ భామ కీర్తి సురేష్. ఆ సినిమాతో పాటు తమిళంలో కూడా మంచి హిట్స్ అందుకుంది. ఈ సినిమాల విజయంతో మంచి క్రేజ్ మీదున్న ఈ అమ్మడికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. కాని నేను గ్లామర్ కు దూరం అని కండిషన్స్ పెట్టడం తో అవకాశాలు కూడా దూరం అవుతున్నాయి. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ రిమేక్ తని ఒరువన్ లోకూడా ఇలాగే అవకాశాన్ని మిస్ చేసుకుందీ. అలాగే తమిళం లో కూడా పరిస్తితి ఇలాగే ఉందట !  మరి కీర్తి సురేష్ తన పంథా ను మార్చుకుంటే తప్ప ఇక్కడ నెగ్గుకు రావడం కష్టమే? 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ