Advertisement

వీరా..! నీతులు చెప్పేది...!

Fri 11th Mar 2016 08:11 PM
praveen sattaru,website reviews,guntur talkies,shourya,krishnastami,dil raju,prakash raj  వీరా..!  నీతులు చెప్పేది...!
వీరా..! నీతులు చెప్పేది...!
Advertisement

వాస్తవానికి చాలా కాలం ముందు సినీ పత్రికలు సినిమా బాగాలేకపోయినా బాగున్నాయంటూ రాసేవి. ఇది భజన కాదు మా బాధ్యత అంటూ వారు తప్పించుకునే వారు. సినిమా వాళ్లు ఇచ్చే ప్రకటనలపైనే ఆధారపడటంతో వారికి అలా భజన చేయడం తప్పనిసరైంది. కానీ ఎప్పుడైతే సోషల్‌మీడియా, వెబ్‌సైట్లు వంటివి మొదలయ్యాయో అప్పటి నుండి యాంటీ ఆర్టికల్స్‌, మరీ ముఖ్యంగా సినీ రివ్యూలు, రేటింగ్‌లతో సినిమా వారికి వెబ్‌సైట్లపై గొంతుదాకా కోపం ఉంటోంది. దాంతో వారు తమ సినిమాల విషయంలో రివ్యూలు యాంటిగా వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. అసలు రివ్యూలనే తప్పుపడుతూ... వీలైనంతలో తమ ఆగ్రహాన్ని చూపిస్తూ వస్తున్నారు. నిన్నటికి నిన్న 'కృష్ణాష్టమి' చిత్రం విషయంలో దిల్‌రాజు తన సినిమాకు తనే రేటింగ్‌ ఇచ్చుకున్నాడు. కానీ సినిమా విడుదలైన తర్వాత వెబ్‌సైట్లు రాసిన రివ్యూలే కరెక్ట్‌ అని ప్రేక్షకులు రుజువుచేశారు. ఇక 'శౌర్య' విషయంలో ప్రకాష్‌రాజ్‌ ఇలాగే మండిపడ్డాడు. సినిమా పరిస్థితి గమనిస్తే రివ్యూలు ఏవిధంగా రాసాయో అనే నిజమని తేలింది. 

ఇక తన కిందటి చిత్రాల రివ్యూలపై మండిపడ్డ వర్మ, ప్రవీణ్‌సత్తార్‌ వంటి వారు కూడా రివ్యూలను తప్పుపట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వర్మ విషయంలో రివ్యూలు రాసేవారి పాయింటే కరెక్ట్‌ అని అందరూ నిరూపించారు. ఇక తన కెరీర్‌లో ఇప్పటివరకు మంచి చిత్రాలను తీసిన ప్రవీణ్‌సత్తార్‌ తాజాగా తీసిన 'గుంటూరు టాకీస్‌' సినిమా చూస్తే అసలు ఆయనకు ఎదుటివారిని విమర్శించే నైతిక హక్కు ఉందా ? అనే సందేహం వస్తుంది. సి గ్రేడ్‌ సినిమాలా విచ్చలవిడి, విశృంఖలతో కూడిన సన్నివేశాలు, డైలాగులు.. ఇలా సినిమా మొత్తం బూతే కనిపిస్తుంది. ఒకప్పటి మారుతి సినిమా అయితే ఓకే అనవచ్చు. కానీ ప్రవీణ్‌సత్తార్‌ వంటి దర్శకుడు తన గత చిత్రాలు కమర్షియల్‌గా వర్కౌట్‌ కాకపోవడంతో కేవలం నాలుగురాళ్లు సంపాదించుకునే ఉద్ధేశ్యంతోనే ఇంతకు దిగజారాడని భావించవచ్చు. ఇంతటి బాధ్యతారాహిత్యంగా, కనీస నైతిక విలువలు లేకుండా 'గూంటూరు టాకీస్‌'ను ఆయన తీసిన తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి దీనికి ఆ మేథో దర్శకుడు ఏం సమాధానం చెప్తాడో చూడాలి. వీరా.. మీడియాకు నీతులు చెప్పేది అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement