Advertisementt

మళ్ళీ సంపూ జ్వరం మొదలయింది!

Fri 11th Mar 2016 01:50 PM
kobbari matta,sampoornesh babu  మళ్ళీ సంపూ జ్వరం మొదలయింది!
మళ్ళీ సంపూ జ్వరం మొదలయింది!
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలంటే బడా ఫ్యామిలీల నుండి వస్తేనే సినీ పరిశ్రమలో ఓ గుర్తింపు ఉంటుంది అనేది పాత మాట. అసలు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా అనామకుడిగా వచ్చి నేడు బర్నింగ్ స్టార్ అయిన సంపూర్నేష్ బాబు హీరోగా వచ్చిన మొదటి చిత్రం హృదయ కాలేయం తరువాత అంతటి సినిమా మళ్ళీ పడలేదు. అడపా దడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వేసుకుంటూ అవకాశం చిక్కినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తను ఇంకా ఉన్నాననే అభిప్రాయం ఏర్పరించిన సంపూ ఈజ్ బ్యాక్. కొబ్బరిమట్ట అన్న కొత్త మూవీ చాన్నాళ్ళ క్రితమే మొదలెట్టినా మళ్ళీ ఇప్పుడిప్పుడే మార్కెట్టులో హల్-చల్ చేస్తోంది. ఆండ్రాయిడ్ అనే పాత్రలో సంపూ ఎలా ఉండబోతున్నాడు అనేదానికి శాంపిలుగా ఈ రోజు కొత్త ప్రచార చిత్రం విడుదలయింది. బొమ్మలో ఏమున్నా లేకున్నా సంపూ బైక్ మీద స్టైలిష్ లుక్కుతో ఉండడం వల్ల ఈ పిక్ మీడియాలో ఎంచక్కా షికార్లు కొడుతోంది. స్టీవెన్ శంకర్ కథ, మాటలు, కథనం అందించడంతో పాటుగా రూపక్ రోనాల్డ్ సన్ అన్న పేరుతో దర్శకత్వం కూడా వహిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పాలకొల్లు తదితర ప్రదేశాలలో షూటింగ్ ఆఖరి దశలో ఉంది. చూడబోతే సంపూ ఫీవర్ మళ్ళీ పట్టుకునేట్టుగానే ఉంది!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ