Advertisementt

లీకయ్యిందా లేదా, ఏది సరైనది?

Thu 10th Mar 2016 07:49 PM
sarainodu song leaked,allu arjun  లీకయ్యిందా లేదా, ఏది సరైనది?
లీకయ్యిందా లేదా, ఏది సరైనది?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ సరైనోడు చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ ఇప్పటికే వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్ తరువాతైతే సినిమా మీద అంచనాలు బాగా ఎక్కువయిపోయాయి. అటువంటి తరుణంలో సరైనోడు చిత్రంలోని పాట లీకయ్యిందని, ఆ పాటను ఎక్కడైనా ఎవరైనా వినియోగిస్తే చట్టరీత్యా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని నిర్మాతల నుండి నిన్న ప్రెస్ నోట్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అంతకన్నా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఆ లీకయిన పాట అంతర్జాలం మొత్తం వెతికినా ఎక్కడా కనబడటం లేదంట. కొందరైతే కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా ఓ గేమ్ ఆడుతున్నారని కూడా నీలాపనిందలు మోసేస్తున్నారు. మరి దీనికి సరైనోడు ప్రమోషన్ టీం ఎలా స్పందిస్తుందో తెలీదు గానీ, ప్రస్తుతానికి అయితే జనాలు లీకయింది అన్న భ్రమలోనే ఉన్నారు. నిజంగా లీకయి ఉంటె ఈ పాటికి ఎక్కడో ఓ మూలన దాని ఆనవాలు అయినా దొరకాలి కదా అన్నది మరో వాదన. చూడబోతే ఇది ప్రచారంలో ఓ స్టంట్ అయినా బాగానే పేలింది. ముందుగా సరైనోడు పాటల పండగ వరకు ఆగితే మిగతా విషయాలన్నీ అక్కడే, అప్పుడే మాట్లాడుకోవచ్చు. రిలీజ్ డేట్ అయితే ఏప్రిల్ 22కి లాక్ చేసారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ