నాని హీరోయిన్‌కు మంచి అవకాశాలు!

Fri 04th Mar 2016 02:58 PM
mehreen kaur,nani,sai dharam tej,anushka sharma  నాని హీరోయిన్‌కు మంచి అవకాశాలు!
నాని హీరోయిన్‌కు మంచి అవకాశాలు!
Advertisement
Ads by CJ

నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌. ఈ చిత్రంలో ఆమె మహాలక్ష్మీ క్యారెక్టర్‌లో తన నటనతో, అందంతో అందరినీ అలరించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. కళ్యాణ్‌రామ్‌ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక రచయిత బి.వి.యస్‌.రవి అలియాస్‌ మచ్చ రవి మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా చేయనున్న చిత్రంలో కూడా ఈమెకు అవకాశం లభించిందని సమాచారం. కాగా తాజాగా ఈ భామకు ఓ బాలీవుడ్‌ సినిమాలో చాన్స్‌ వచ్చిందని తెలుస్తోంది. హీరోయిన్‌ అనుష్కశర్మ నిర్మాణసంస్థలో నిర్మిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు ఎందరినో అనుకున్నారు. ఎట్టకేలకు మెహ్రీన్‌కౌర్‌కు ఈ చిత్రంలో హీరోయిన్‌ అవకాశం వచ్చిందని సమాచారం. ఆమె తెలుగు కంటే ముందు పంజాబీ సినిమాల్లో నటించింది. ఆ చిత్రాలను చూసిన దర్శకనిర్మాతలు ఈ చిత్రంలో ఆమెకు అవకాశం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ