సునీల్‌ మారాడా...?

Fri 04th Mar 2016 02:41 PM
sunil,krishnashtami,vamsi krishna akella,jakkanna  సునీల్‌ మారాడా...?
సునీల్‌ మారాడా...?
Sponsored links

వరస ఫ్లాప్‌లు ఎంతటి వారినైనా కలవరపెడతాయి. ఇప్పుడు హీరో సునీల్‌ పరిస్థితి అలాగే ఉంది. రీసెంట్‌గా దిల్‌రాజు నిర్మాతగా, వాసువర్మ దర్శకత్వంలో సునీల్‌ హీరోగా నటించిన 'కృష్ణాష్టమి' చిత్రం ఘనవిజయం సాధిస్తుందని సునీల్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా ప్రస్తుతం సునీల్‌ వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'జక్కన్న' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని మేనెలలో రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. కానీ 'కృష్ణాష్టమి' ఇచ్చిన షాక్‌లో ఉన్న సునీల్‌ తన నుండి ప్రేక్షకులు ఇతర అంశాలను కాకుండా ఎక్కువగా కామెడీని ఆశిస్తున్నారని గ్రహించాడట. దాంతో 'జక్కన్న' చిత్రంలో సాధ్యమైనంత కామెడీని ఎలా చొప్పించాలా? అనే విషయంలో ఆయన దర్శకునితో కలిసి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే రీషూట్‌ చేసైనా కామెడీని కలిపేందుకు కూడా సునీల్‌ ఫిక్స్‌ అయ్యాడని సమాచారం. మొత్తానికి సినిమా ఎంత లేటు అయినా ఫర్వాలేదు కానీ కామెడీని మాత్రం మిస్‌ చేయకూడదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. మరి సునీల్‌కు ఈ విషయంలో ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందన్న మాట బలంగా వినిపిస్తోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019