Advertisementt

రూటు మారుస్తోన్న క్రిష్‌!

Thu 03rd Mar 2016 02:44 PM
krish,rayabhari,akshay kumar,trinity pictures  రూటు మారుస్తోన్న క్రిష్‌!
రూటు మారుస్తోన్న క్రిష్‌!
Advertisement
Ads by CJ

విభిన్న కథా చిత్రాలను, సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాలను తీయడంలో దర్శకుడు క్రిష్‌ది విభిన్నమైన శైలి. తాజాగా ఆయన జేమ్స్‌బాండ్‌ తరహా థ్రిల్లర్‌తో వరుణ్‌తేజ్‌తో 'రాయబారి' అనే చిత్రం చేద్దామని భావించాడు. కానీ ఈ ప్రాజెక్ట్‌ మెటీరియలైజ్‌ కాలేదు. తాజాగా ఆయన హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్ట్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తన గత చిత్రాలకు భిన్నంగా పూర్తిస్థాయి వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రంగా ఆయన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. హిందీలో ఈ చిత్రంలో అక్షయ్‌కమార్‌ హీరోగా నటిస్తుండగా, తమిళంలో హీరోను ఇంకా ఫైనలైజ్‌ చేయాల్సివుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'ట్రినిటీ పిక్చర్స్‌'తో పాటు ఈ చిత్రాన్ని ఈరోస్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించనుంది. కాగా గతంలో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్‌' చిత్రంలో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ