Advertisementt

దిల్ రాజు 13 రోజుల సంబరం

Tue 01st Mar 2016 02:29 PM
dil raju,krishnashtami,devi theater,hyderabad,dil raju on krishnashtami movie  దిల్ రాజు 13 రోజుల సంబరం
దిల్ రాజు 13 రోజుల సంబరం
Advertisement
Ads by CJ

కొన్ని సార్లు అబద్దం చెప్పి నమ్మించవచ్చు. అన్ని సార్లు మాత్రం కాదు. ఈ విషయం దిల్ రాజుకు తెలియంది కాదు. సునీల్ తో తీసిన 'కృష్ణాష్టమి' చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ, తన ఠీవీ ని ప్రకటించి సినిమా హిట్ హిట్ అని దిల్ రాజు చెప్పుకున్నారు. 'కృష్ణాష్టమి' తో లబోదిబో అంటున్న బయ్యర్ల ఆర్తనాదాలు ఆయనకు వినిపించలేదు. కేవలం ట్రేడ్ లో తన బ్రాండ్ ఇమేజ్ పడిపోకుండా ఉండేందుకే హిట్ అని చెప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ లో అందరికీ తెలిసిపోయింది. మరోవైపు హిట్ అని చెప్పుకున్న 'కృష్ణాష్టమి' చిత్రాన్ని థియేటర్లలో ఆడించే ప్రయత్నం కూడా ఫలించలేదు. తాజాగా హైదరాబాద్ దేవి థియేటర్ లో ప్రదర్శిస్తున్న ఈ చిత్రానికి టెర్మినేషన్ చెప్పేశారు. మార్చి 4 నుండి 'శౌర్య' ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. అంటే కృష్ణార్పణం సంబరం కేవలం 13 రోజులే అన్నమాట. కలక్షన్లు లేకుండా అన్ని రోజులు ఆపడం గొప్పే అని మీడియేటర్లు అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ