Advertisementt

అది చూసి నాగ్ ఏడ్చాడట..!

Mon 29th Feb 2016 07:02 PM
nagarjuna,oopiri movie,vamsi padipalli,brundavanam  అది చూసి నాగ్ ఏడ్చాడట..!
అది చూసి నాగ్ ఏడ్చాడట..!
Advertisement
Ads by CJ

టీవీ షోలలో, సినిమాలలో కూడా వరసగా అదరగొడుతున్న కింగ్‌ నాగార్జున తాజాగా కార్తితో కలిసి పివిపి బేనర్‌పై తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న మూవీ 'ఊపిరి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌ సెన్సార్‌ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్‌ క్లీన్‌ యు సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో కూడా తమిళంలో విడుదలైంది. కాగా తెలుగు వెర్షన్‌ ఆడియోను మార్చి 1వ తేదీన గ్రాండ్‌గా ఓపెన్‌ చేయడానికి సిద్దం అవుతున్నారు. కాగా ఈ చిత్రం తమిళ ఫస్ట్‌కాపీ చూసిన నాగార్జున కంటతడి పెట్టాడట. ఫైనల్‌ కట్‌ చూస్తున్నప్పుడు నన్ను నేను కంట్రోల్‌ చేసుకోలేకపోయాను..... ఇలాంటి చిత్రంలో చేయడం ఎంతో గర్వంగా ఉంది.. అన్నాడు నాగార్జున. 'బృందావనం, ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు అన్న విషయం తెలిసిందే. కాగా ఈచిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అంటే మార్చి 25న విడుదలకు సిద్దమవుతోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ