Advertisementt

వర్మ ట్విట్: ద‌మ్ముంటే ముంబై రండి!!

Tue 23rd Feb 2016 11:21 PM
ram gopal varma,vangaveeti movie,warnings,vijayawada,ram gopal varma warning  వర్మ ట్విట్: ద‌మ్ముంటే ముంబై రండి!!
వర్మ ట్విట్: ద‌మ్ముంటే ముంబై రండి!!
Advertisement
Ads by CJ

విజ‌య‌వాడ రౌడీయిజంపై 'వంగ‌వీటి' పేరుతో  సినిమా తీయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కి బెదిరింపులు ఎక్కువ‌య్యాయా?  విజ‌య‌వాడ వ‌స్తే చంపేస్తామ‌ని తీవ్ర స్థాయిలో  హెచ్చ‌రిక‌లు చేస్తున్నారా?  వ‌ర్మ ట్వీట్ల‌ని బ‌ట్టి చూస్తే అది నిజ‌మే అనిపిస్తోంది. మాఫియాపైనా, ఫ్యాక్ష‌నిజంపైనా, రౌడీయిజంపైనా సినిమాలు తీయ‌డం వ‌ర్మకి కొత్తేమీ కాదు.  ఆయా సినిమాల్ని తీస్తున్న‌ప్పుడు కూడా తీవ్ర స్థాయిలోనే బెదిరింపులు వ‌చ్చాయి. కానీ వ‌ర్మ మాత్రం ఎప్పుడూ పెద్ద‌గా స్పందించ‌లేదు. ఈసారి మాత్రం ఆయ‌న కాసింత ఘాటుగా స్పందించాడు. బెదిరింపుల‌కి ధీటుగా  రెచ్చిపోయి ట్వీట్లు చేశాడు. రివ‌ర్స్ ఎటాక్‌లో తిరిగి వార్నింగ్‌లు కూడా ఇచ్చాడు. 'న‌న్ను విజ‌య‌వాడ‌కి రావొద్ద‌ని బెదిరిస్తున్నారు... కానీ నేను వ‌స్తున్నాను, రావ‌డ‌మే కాదు... ఎక్క‌డ ఉంటానో  అడ్ర‌స్ కూడా చెబుతా. మ‌రి  మీకు ద‌మ్ముంటే ముంబైలో అడుగుపెట్టండి' అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. నేను ఆనాటి రౌడీల‌తో తిరిగిన సిస‌లైన రౌడీన‌న్న విష‌యం ఈనాటి ఆకురౌడీలు తెలుసుకోవాల‌ని ట్వీట్ చేశాడు. ఈ నెల 26న విజ‌య‌వాడ వ‌స్తున్నానంటూ హోట‌ల్ పేరు, ఫ్లైట్ టిక్కెట్ వివ‌రాల్ని కూడా ట్విట్ట‌ర్‌లో పెట్టేశాడు వ‌ర్మ‌. ఆయ‌న‌కి ఎంత‌గా బెదిరింపులు వ‌చ్చుంటే ఇంత‌గా రివ‌ర్స్ ఎటాక్ చేస్తాడో ఊహించొచ్చు. మొత్త‌మ్మీద వ‌ర్మ విజ‌య‌వాడ సంద‌ర్శ‌న వాడి వేడిగా సాగే అవ‌కాశాలున్నాయి.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ