Advertisementt

ఈ మెగాహీరో.. తప్పు తెలుసుకున్నాడు!

Mon 22nd Feb 2016 04:58 PM
varun tej,nagababu son,kanche,rayabari,sai dharam tej,krish,varun tej movies  ఈ మెగాహీరో.. తప్పు తెలుసుకున్నాడు!
ఈ మెగాహీరో.. తప్పు తెలుసుకున్నాడు!
Advertisement
Ads by CJ

మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడిగా తెరంగేట్రం చేసిన హీరో వరుణ్‌తేజ్‌. ఆయన తన తెరంగేట్రం చేసిన ఒకే ఏడాదిలోపు 'ముకుంద, కంచె, లోఫర్‌' వంటి మూడు చిత్రాలను యమ స్పీడ్‌గా లాగించేశాడు. ఇందులో ఆయన నటించిన 'ముకుందా' చిత్రం కాస్త నిరాశపరిచింది. ఇక 'లోఫర్‌' చిత్రం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కానీ 'కంచె' సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్‌ కాకపోయినా ఆయన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఇలా ఏడాది గ్యాప్‌లో ఆయన నటించిన చిత్రాలు తనకు మంచి హిట్టునైతే ఇవ్వలేకపోయాయి. కాగా ఆయన మరలా 'కంచె' దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలోనే 'రాయబారి' అనే సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన లోకేషన్లు సరిగా కుదరకపోవడంతో ఈ చిత్రం ఆలస్యం అవుతోందని యూనిట్‌ చెబుతున్నప్పటికీ ఈ చిత్రం బడ్జెట్‌ వరుణ్‌తేజ్‌కు ఉన్న మార్కెట్‌ కంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాల్సిన పరిస్థితి ఉండటంతో దర్శకనిర్మాత క్రిష్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఆపేశాడని టాలీవుడ్‌టాక్‌.
ఈ సినిమా విషయంలో మరో వార్త కూడా ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'రాయబారి' చిత్రంలో కూడా క్రిష్‌ 'కంచె'లో నటించిన హీరోయిన్‌ ప్రగ్యాజైస్వాల్‌ను తీసుకోవాలని భావించాడని, అందుకు ఇష్టపడని వరుణ్‌తేజ్‌ హీరోయిన్‌ను మార్చమని క్రిష్‌పై ఒత్తిడి తెచ్చాడని, కానీ అందుకు క్రిష్‌ ఒప్పుకోకపోవడం వల్లే ఈ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తి.... ఒకరికొకరు పంతాలకు పోవడంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే వార్తలు కూడా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. సో... మొదటి మూడు చిత్రాలు పెద్దగా ఆడకపోవడతంతో వరుణ్‌తేజ్‌ వెంట వెంటనే సినిమాలను చేసే విషయాన్ని గ్రహించి. ఇప్పుడు కాస్త గ్యాప్‌ తీసుకుంటూ మంచి బ్రేక్‌ను ఇచ్చే కథ కోసం ఎదురుచూస్తున్నాడని, అందుకే నిదానమే ప్రదానం అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం యువ మెగాహీరోలైన వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు ఇద్దరు తమ తమ సినిమాలను ఎక్స్చేంజ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో  ఓ సినిమా చేయడానికి సాయిధరమ్‌తేజ్‌ ఒప్పుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి వరుణ్‌తేజ్‌ వచ్చి చేరాడు. ఇక వరుణ్‌తేజ్‌ చేయాల్సిన గోపీచంద్‌ మలినేని సినిమాను వరుణ్‌తేజ్‌ వదిలేస్తే అది సాయిధరమ్‌తేజ్‌ వద్దకు వెళ్లిందని సమాచారం. కాగా నిదానమే ప్రదానం అని తెలుసుకున్న వరుణ్‌తేజ్‌ దిల్‌రాజు నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని మార్చి చివరి వారంలో గానీ, లేదా ఏప్రిల్‌ మొదటివారంలో గానీ పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రానికి 'ఫీల్‌మై లవ్‌' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేయనున్నారని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ