బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' చిత్రం ఆడియో వేడుకను ఆంధ్రప్రదేశ్ నూతన రాజదాని అమరావతిలో జరిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ఆలోచనలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా ఉన్నట్లు సమాచారం. తన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్' ఆడియో వేడుకను మార్చి 12న నిర్వహించనున్నారు. ఈ వేడుకను అమరావతిలో జరిపితే ఎలా ఉంటుందా? అని ఆలోచన పవన్ ఉన్నాడట. ఈ చిత్రం ఆడియో వేడుకను అమరావతిలో జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ వేడుకకు తగిన ప్రాంతం కోసం అన్వేషణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే పవన్ తన ఆడియో వేడుకకు వేదికగా అమరావతిని ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రానిదే ఈ విషయం నిజమా? కాదా? అనే విషయం చెప్పడం కష్టమని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది వేచిచూడాల్సిన అంశం.