Advertisement

'బాహుబలి' రికార్డులు బ్రద్దలవుతున్నాయ్!

Fri 19th Feb 2016 02:54 PM
bahubali,sardaar gabbar singh,brahmotsavam,bahubali records  'బాహుబలి' రికార్డులు బ్రద్దలవుతున్నాయ్!
'బాహుబలి' రికార్డులు బ్రద్దలవుతున్నాయ్!
Advertisement

'బాహుబలి' చరిత్రలో నిలిచిపోయే చిత్రం. ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వాటిని ఎవ్వరూ బద్దలు కొట్టలేరని అందరూ భావించారు. కానీ మన స్టార్‌ హీరోలు మాత్రం ఇప్పటికే కొన్ని 'బాహుబలి' రికార్డులను తిరగరాస్తున్నారు. ఇప్పటివరకు కేరళలో ఓ తెలుగు చిత్రం అనువాద హక్కులు ఎక్కువ రేటుకి అమ్ముడుపోయిన చిత్రంగా 'బాహుబలి' రికార్డులను సృష్టించింది. కానీ తాజాగా ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కీలకపాత్రలో నిత్యామీనన్‌లతో పాటు కొందర మలయాళ నటీనటులు నటిస్తున్న 'జనతాగ్యారేజ్‌' చిత్రం ప్రారంబానికి ముందే మలయాళ రైట్స్‌ను 'బాహుబలి' కంటే ఎక్కువ రేటుకు అంటే 4.5కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఓవర్‌సీస్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఓవర్‌సీస్‌ రైట్స్‌ 10కోట్లకు అమ్ముడైన 'బాహుబలి' రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేరని భావించారు. కానీ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'  ఓవర్‌సీస్‌ రైట్స్‌ 11కోట్లకు అమ్ముడుకావడంతో 'బాహుబలి' రికార్డును 'సర్దార్‌' బద్దలుకొట్టిందని మెగాభిమానులు సంతోషిస్తున్న సమయంలో వారం తిరగక ముందే మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మూెత్సవం' ఓవర్‌సీస్‌రైట్స్‌ను క్లాసిక్‌ ఎంటర్టైన్మెంట్స్  సంస్థ ఏకంగా 13కోట్లకు ఈ రైట్స్‌ని సొంతం చేసుకొని ఇప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలుకొట్టింది. ఇలా ఒకోక్క స్టార్‌ హీరో చిత్రంతో ఒక్కో 'బాహుబలి' రికార్డ్‌ బద్దలు అవుతుంది. ఇలా మన సినిమాల స్థాయి రోజురోజుకు పెరుగుతుండటం, 'బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టడం శుభసూచకమే అని భావించాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement