Advertisementt

శైలజ.. దండయాత్ర మొదలైంది!

Thu 18th Feb 2016 10:00 PM
keerthi suresh,kajal agarwal,hero vijay,director bharatan,keerthi suresh in vijay movie,nenu sailaja fame  శైలజ.. దండయాత్ర మొదలైంది!
శైలజ.. దండయాత్ర మొదలైంది!
Advertisement

కోలీవుడ్‌లో మంచి క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొంటోంది కీర్తిసురేష్‌. ఇప్పుడామెకు తమళంలో వరసగా అవకాశాలు వెత్తుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఈమె స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌కు కూడా షాక్‌ ఇచ్చింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తన 60వ చిత్రంలో మొదట హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ను ఎంచుకున్నారు ఈ చిత్ర యూనిట్‌. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఈ చిత్ర హీరో విజయ్‌, దర్శకుడు భరతన్‌లు కాజల్‌ను ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పించి ఆ స్థానంలో కీర్తిసురేష్‌ను తీసుకున్నారు. దీంతో ఆశ్యర్యపడి దిగులు చెందడం కాజల్‌ వంతు అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ కూడా ఖరారు చేసింది. మొత్తానికి కీర్తిసురేష్‌ ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కించుకొని కాజల్‌కే కాదు... తమిళంలో మంచి స్థితిలో ఉన్న టాప్‌ హీరోయిన్స్‌కు కూడా వణుకు పుట్టిస్తోంది. కాగా ఈమెకు ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలే వస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మొత్తానికి అతి తక్కువకాలంలోనే అగ్రపీఠానికి చేరుకునే అవకాశం ఈ భామకు ఉన్నాయన్నది కోలీవుడ్‌, టాలీవుడ్‌ వర్గాల మాట! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement