చరణ్ కి ఇక 'నో బ్రేక్‌... నో రెస్ట్‌'!

మొత్తానికి 'బ్రూస్‌లీ' డిజాస్టర్‌ తర్వాత నాలుగునెలలు రెస్ట్‌ తీసుకున్న మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తన తాజా చిత్రం అయిన తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌కు రెడీ అయ్యాడు. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ముహూర్తం జరుపుకోనుంది. ఫిబ్రవరి 18న ఈ చిత్రం ఓపెనింగ్‌ కానుంది. కాగా 'తని ఒరువన్‌' చేయాలని చరణ్‌ నిర్ణయించుకున్న తర్వాత మూడునెలలకు ఈ చిత్రం పట్టాలెక్కనుంది. సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంత లేటు కావడానికి కూడా బలమైన కారణం ఉందనే అంటున్నారు. రామ్‌చరణ్‌కు తగ్గట్లు ఈ చిత్రమూలం చెడిపోకుండా మార్పులు చేర్పులు చేయడానికి డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి ఎంతో శ్రమపడ్డాడని టాక్‌. వాస్తవానికి 'కిక్‌2' డిజాస్టర్‌ తర్వాత సురేందర్‌రెడ్డిని ఈచిత్రానికి దర్శకునిగా ఎంచుకోవడం అనేది ఎంతో గట్స్‌తో చరణ్‌ తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంతగా లేట్‌ కావడంతో ఇక ఈ చిత్రం షూటింగ్‌ మొదలైన తర్వాత సినిమా పూర్తయ్యే వరకు ఇక నో రెస్ట్‌ .. నో బ్రేక్స్‌ అని చరణ్‌ సురేందర్‌రెడ్డికి కూడా ఖచ్చితంగా చెప్పాడట. ఇక ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ బేనర్‌లో అల్లుఅరవింద్‌ నిర్మిస్తుండం ఈ చిత్రానికి మరో ప్లస్‌ కానుంది. సినిమాను స్పీడ్‌గా అతి తక్కువ వర్కింగ్‌ డేట్స్‌లో పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా ఈ చిత్రం రీమేకే కాబట్టి స్పష్టమైన బడ్జెట్‌తో.. అంటే లిమిటెడ్‌ బడ్జెట్‌తో తెరకెక్కించాలనేది చరణ్‌ ఆశయంగా చెబుతున్నారు. మొత్తానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గా మరోసారి రకుల్‌ప్రీత్‌సింగ్‌నే తీసుకోనున్నట్లు సమాచారం. 

ram charan
thanioruvan remake
february 18th
surendar reddy
no rest no break