Advertisementt

సీనియర్లకు నాగ్‌ సవాల్..!

Tue 16th Feb 2016 06:13 PM
nagarjuna,soggade chinni nayana,chiranjeevi,balakrishna  సీనియర్లకు నాగ్‌ సవాల్..!
సీనియర్లకు నాగ్‌ సవాల్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఉన్న సీనియర్‌ స్టార్స్‌లో కేవలం బాలకృష్ణకు మాత్రమే 50కోట్ల క్లబులో చేరే అవకాశాలు ఉన్నాయని నిన్నటివరకు అందరూ భావించారు. కానీ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో ఈ మార్క్‌ను నాగ్‌ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే ఈ చిత్రం 50కోట్ల షేర్‌ను వసూలు చేసి ఇంకా మంచి కలెక్షన్లతో రన్‌ అవుతోంది. కాగా ఈచిత్రంతో నాగార్జున తనతోటి సీనియర్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లకు కూడా సవాల్‌ విసిరాడు. త్వరలో బాలయ్య చేయబోయే తన 100వ చిత్రం ద్వారా బాలయ్య 50కోట్ల క్లబ్బులో చేరుతాడా? లేక చిరంజీవి చేయబోయే 150వ చిత్రం ద్వారా ఆయన 50కోట్ల క్లబులో తన పేరు లిఖించుకుంటాడా? లేక వెంకటేష్‌ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'బాబు బంగారం' చిత్రం 50కోట్ల క్లబ్‌లో చేరుతుందా? వంటి సందేహాలు మిగిలిన హీరోలందరికీ, మరీ ముఖ్యంగా వారి అభిమానులకు నాగ్‌ సవాల్‌ విసిరాడు. కేవలం నాలుగు వారాలకే నాగ్‌ ఈ ఘనత సాదించాడు. తెలుగులో సోలోహీరోగా సీనియర్‌ స్టార్‌ అందుకున్న తొలి ఫీట్‌ ఇది అని చెప్పవచ్చు. కేవలం 15కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సోగ్గాడు 50కోట్ల క్లబ్చులో స్థానం సంపాదించుకొని నాగ్‌కు నిర్మాతగా కూడా బోలెడు లాభాలను తీసుకువచ్చింది. మరి ఏ సీనియర్‌ హీరో రాబోయే రోజుల్లో నాగ్‌ ఫీట్‌ను రిపీట్‌ చేస్తాడో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ